Mar 23, 20232 min

Rangamarthanda (రంగమార్తాండ!) ఇది సినిమా కాదు. మన అమ్మానాన్నల కథ. మన కథ. మనందరి కథ. ఇది నిజం.

Updated: Apr 21, 2023

ఈ సినిమా కంటే ముందే " నటసామ్రాట్" మరాఠి సినిమా చూసాను. నిన్న రంగమార్తాండ చూసాను. చూసి సుమారు 30 గంటలు దాటిన ఇంకా మైండ్ లో ఆ ఫీల్ రన్ అవుతుంది. ఇది కచ్చితంగా మా గురువు Krishna Vamsi సర్ మ్యాజిక్ అనాల్సిందే. తెలుగు కోసం చేంజెస్ చేసిన ఆ ఫీల్ మిస్ అవ్వలేదని కచ్చితంగా చెప్పగలను. నేను ఫీల్ అయ్యాను. ఏదైనా సినిమా రీమేక్ చేసినప్పుడు, ఆ సినిమా పాత్రలలో నటించిన నటుల్ని ,చూపించిన విధానాన్ని పోల్చుకుంటారు. అలా పోల్చుకోవద్దు. అది మరాఠి సినిమా, అక్కడ చూసేది మరాఠి ప్రేక్షకులు, ఇది మన తెలుగు సినిమా, ఇక్కడ చూసేది తెలుగు ప్రేక్షకులు. మన చుట్టూ వున్నా వాతావరణం,సాంఘిక పరిస్థితులు,మన సంస్కృతి,జీవనశైలి అన్ని మనపైన ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి మన తెలుగు సినిమాకు కావాల్సిన రీతిలో చూపించినప్పుడు, ఆ క్యారెక్టర్స్, ఎమోషన్స్ కి కనెక్ట్ అయ్యామా లేదా అన్నది ముఖ్యం. అది మీరు ఫీల్ అవుతారు. ఈ సినిమా తప్పక చూడండీ. తరువాత వీలైతే "నటసామ్రాట్" సినిమాను చూడండి. నాతో ఏకీభవిస్తారు. కానీ కచ్చితంగా ఈ సినిమా మిస్ అవ్వొద్దు.ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. అందరు తల్లిదండ్రులతో, మీ పిల్లతో థియేటర్లో చూడండి. ఇది థియేటర్లో చూడాల్సిన సినిమా.

నాకు ప్రత్యేకంగా ఈ సినిమాలో కొన్ని విషయాలు తప్పక చెప్పాల్సినవి వున్నాయి అనిపించింది. అది మన వృత్తి మీద మనకు ఎంత పట్టు ఉండాలో మరోసారి ప్రూవ్ చేశారు అనిపించింది.

మా గురువు గారు కృష్ణవంశీ గారికి ఎంత పట్టు ఉండాలి సుమారు 3 దశాబ్దాలుగా కమెడియన్ గా గుర్తింపు వున్నా బ్రహ్మానందం గారితో అలాంటి పాత్రా చేయిచాలంటే, అలాగే బ్రహ్మానందం గారి కి ఎంత పట్టుంటే అలాంటి భిన్నమైన ఇమేజ్ వున్నా పాత్రని ఒప్పుకొని చేయటానికి. అది వాళ్లకు వాళ్ళమీద, వాళ్ళ వృత్తి మీద వున్నా నమ్మకం,పట్టు, అందుకే కృష్ణ వంశి గారిని "క్రియేటివ్ " డైరెక్టర్ అని మనందరం పిలుచుకుంటాం.ఇది మరో సారి నిరూపించి మనందరి ప్రశంశలు పొందుతున్నారు.

మన వృత్తి మీద మనకు పట్టు ఉంటే డైలాగ్స్ తోనే కాదు షాయరీతో కూడా హార్ట్ టచ్ చేయొచ్చు అని Lakshmi Bhupala అన్న నిరూపించారు.

మరో ముఖ్యమైనది నెపోటిజం …ఎంతమంది డైరెక్టర్స్ వారసులు,ఆక్టర్స్ వారసులు ఫెయిల్ అయ్యారు. ఇక్కడ టాలెంట్ మాత్రమే ముందుకు తీసుకెళుతుంది. ఎంట్రీ ఈజీ అవ్వొచ్చు... కానీ ప్లేస్ కాదు. ఇదంతా ఎందుకు చెపుతున్నాను అంటే హీరో రాజశేఖర్ గారి వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన Shivathmika Rajashekar (శివాత్మిక) నటన చూసాక మనకు నేపోటిజం గుర్తుకు రాదు. “టాలెంట్ ఎవడబ్బ సొత్తు కాదు” అన్న మాట గుర్తొస్తుంది.

మిగతా అందరు నటులు, టెక్నిషన్స్ అందరు వారి వారి పనిని అద్భుతంగా చేశారనే చెప్పాలి. సినిమా అనేది టీం వర్క్ అందరి భాగస్వామ్యం ఉంటుంది. ఈ సినిమాలో కూడా వుంది. దాని నడిపించిన మా గురువు గారు ఎప్పుడు మాకు ఆదర్శమే. హాట్స్ ఆఫ్ సర్!!

    30
    1