Bhagyaraja Decoded - Unveiling the Genius of Bhagyaraja: A Masterclass in Screenwriting from the Legend Himself
- Harinath Babu B
- Dec 5, 2024
- 1 min read
భాగ్యరాజా decoded పుస్తకం - ప్రముఖ దర్శకులు, రచయిత,నటులు, సంగీత దర్శకులు. - 1980 దశకంలో తమిళ సినిమా రంగంలో తన ప్రత్యేక స్క్రీన్ ప్లే శైలితో సినిమా ప్రేమికుల మనసులో ప్రత్యేక స్థానాన్ని పొందారని అందరికి తెలిసిన విషయమే. వారి సినిమాలు, ఇటు తెలుగులో, అటు హిందీలో డబ్బింగ్ మరియు రీమేక్ చేయబడి అద్భుతంగా సక్సెస్ అయ్యాయి. వారు రాసిన తమిళ పుస్తకం - “వాంగ సినిమావై పట్రిఱి పెసలామ్ “ కు ఈ పుస్తకం తెలుగు అనువాదం.
ఈ పుస్తకం చదివాకా నాకు అనిపించిన ఫీలింగ్ షేర్ చేసుకోవాలనిపించింది.
మీరు సినిమా కథని రాస్తున్నారా… ?
అల్రెడీయా వ్రాసారా… ?
సినిమాని డైరెక్ట్ చేయాలనుకుంటున్నారా… ?
డైరెక్ట్ చేశారా… ?
అయితే … ఇది మనం చదువాల్సిన పుస్తకం.

అయితే ఒక్క కండిషన్ ఇది కచ్చితంగా ఒక్క కథైనా అలోచించి పేపర్ పైన పెట్టెన వాళ్ళకు ఇది చాలా ఉపయోగపడుతుంది.
కథ రాస్తున్నప్పుడు.. ఎలాంటి విషయం, ఎలా చెపితే, ఎక్కడ చెపితే … బాగుంటుంది అనే విషయాలను ..భాగ్యరాజా గారు మన పక్కనే కూర్చొని డిస్కస్ చేసినట్లు ఉంటుంది.
.ఒక డైరెక్టర్ సినిమా మేకింగ్ ప్రాసెస్లో ఎలా స్క్రిప్టుని, ఎప్పటికప్పుడు బెటర్ చేయొచ్చొ … లైఫ్ ఇన్సిడెంట్స్ ఎలా ఇంకార్పొరెట్ చేయొచ్చొ తన గొప్ప అనుభవం ఇప్పటి రైటర్స్ కి, దర్శకులకు ఖచ్చింతంగా ఉపయోగ పడుతుంది.
తన సినీ ప్రస్థానాన్ని, సినిమాలని రెఫెర్ చేస్తూ .. చెప్పిన విషయాలను నోట్ చేసుకొని, ఒకసారి చదివి ఆ,ఆ సినిమాలని చూస్తే… ఇంకా బెటర్ అవుతుందని నా అభిప్రాయం… నేను అలా కొన్ని సినిమాలు చూసినవైనా.. చదివాకా మళ్ళి చూసాను.
ఇది సినిమా రచన గ్రామర్ రూల్స్ ని చెప్పే పుస్తకం కాదు.. కానీ రైటర్ అండ్ డైరెక్టర్ షూస్స్ లో కాలు పెట్టి నిలుచున్న ప్రతి వ్యక్తికి కచ్చితంగా ఈ పుస్తకం వ్యాల్యూ అర్థం అవుతుంది.
ఇలాంటి పుస్తకాన్ని తెలుగులోకి అనువదించి, తెలుగు సినిమా రైటర్స్కి, డైరెక్టర్స్ కి అందుబాటులోకి తెచ్చిన సూర్యప్రకాష్ జోశ్యుల గారు చాలా అభినందనీయుడు. అలాగే శ్రీనివాస్ తెప్పలా గారి అనువాదం చాలా బాగుంది.
ఈ పుస్తకంలో పార్ట్ -1 ఒరిజినల్ పుస్తకం అయితే… పార్ట్-2 అండ్ పార్ట్-3 సూర్య ప్రకాష్ గారి సేకరణ కొంత, ఇంటర్వ్యూలు కొంత … వారి విశ్లేషణ అంత కూడా బాగున్నాయి. ఇంకా ఇలాంటి మంచి పుస్తకాలు, తెలుగు సినిమా ప్రేమికులకు అందివ్వాలని కోరుకుంటున్నాను.
జోషుల గారు… మీ యూట్యూబ్ కంటెంట్ కూడా బాగుంది.. అల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ పబ్లికేషన్స్ అండ్ వ్లాగ్స్.
留言