top of page
  • Writer's pictureHarinath Babu B

సినిమా స్క్రిప్ట్ (కథ) రిజిస్ట్రేషన్

Updated: Dec 31, 2021

కథని మన బ్రెయిన్ చైల్డ్ అంటారు. మనకు తట్టిన ఒక చిన్న ఆలోచన బ్రెయిన్లోనే పురుడుపోసుకొని ఒక కథ రూపంగా మారడానికి కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్నిసార్లు సంవత్సరాలు కుడా పడుతుంది. అయితే ఒక రచయిత/రైటర్ తను తన కథ ద్వారా అనుభవించిన ఆనందాన్ని అందరికి పంచడానికి ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎన్నుకుని జనం దగ్గరకి తీసుకెళ్తారు.

ఒకవేళ రచయిత/రైటర్ తన కథను ప్రధానంగా సినిమా ద్వారా జనాల దగ్గరికి తీసుకు రావడానికి (తీసుకు వెళ్ళాలంటే) ఎంతోమంది సహకారం అవసరం; అలాగే ఎంతో మందికి తన కథను వినిపించాల్సిన అవసరం ఉంటుంది. అలాంటప్పుడు రచయిత/రైటర్ తన కథని వేరేవాళ్లకి చెప్పడానికి భయపడతాడు. ఎవరు తన బిడ్డని (కథని) దొంగిలించి వాల్ల బిడ్డ (వాల్ల కథగా) గా చెప్పుకుంటారోనని? అలాంటి సందర్భంలోనే మనము మన స్క్రిప్ట్ ని (కథని) రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ స్క్రిప్ట్ ని ఎలా రిజిస్ట్రేషన్ చేయాలి? ఎక్కడ చేయాలి? ఎప్పుడు చేయాలి? ఇలాంటి ప్రశ్నలుయెన్నో వస్తాయి. ఇలాంటి ప్రశ్నలకు జవాబే ఈ ఆర్టికల్. మీలో ఎవరైనా ఈ చిట్కాలు/టిప్స్ పాటించి మీ కథని రిజిస్టర్ చేసుకోవచ్చు.


నేషనల్ లెవల్ లో స్వా SWA (స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ - Screen Writers Association) ఉన్నది. కానీ తెలుగువారికి ముఖ్యంగా తెలుగు సినిమా రచనలని రిజిస్ట్రేషన్ చేయడానికి తెలుగు సినీ రైటర్స్ అసోసియేషన్ ఒక చక్కటి మార్గాన్ని ఏర్పాటు చేసింది.


దీనికి కావలసిన హర్హతలు

  1. తెలుగు సినీ రైటర్స్ అసోసియేషన్ లో మెంబెర్ అయ్యుండాలి లేదా

  2. తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ లో మెంబెర్ అయ్యినా కావలి.

కథని సమర్పించు విధానం

  • రచయిత తన కథని కథ రూపంలో కానీ, లేదా కథ మరియు కథనం (స్క్రీన్ ప్లే) మొత్తం కానీ, లేదా మొత్తం కథని సంభాషణలతో కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

  • మీరు మీ స్క్రిప్ట్‌ను ఏ భాషలోనైనా సమర్పించవచ్చు (రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు).

  • ప్రతి 25 పేజీలకు కాను రూపాయలు 300 ఛార్జ్ చేస్తున్నారు. మినిమం 25 పేజీలు తప్పనిసరి.

Telugu Cine Writers' Association story fee registration receipt
Telugu Cine Writers' Association story fee registration receipt

ఎలా తయ్యారు చేయాలి?

  1. మొదటి పేజీలో కథ పేరు ఉండాలి (గమనిక: పేరుకి రిజిస్ట్రేషన్ వర్తించదు కావున ఏదైనా వర్కింగ్ టైటిల్ పెట్టుకోవచ్చు)

  2. రచయిత/రైటర్ పేరు

  3. సభ్యత్వం నెంబర్ (పైన చెప్పిన ఎదైనా ఒక్క అసోసియేషన్ మెంబెర్ షిప్ కార్డు నెంబర్)

  4. మొత్తం పేజీల సంఖ్య

  5. ప్రతి పేజీలో పేజీ నెంబర్ ఉండాలి

  6. పేజీ మధ్యలో ఎక్కడ ఎక్కువ గ్యాప్ లేకుండా చూసుకోవాలి

  7. ప్రతి పేజీ బాటమ్ లో 3 ఇంచెస్ స్పేస్ ఇవ్వాలి అక్కడ స్టాంప్స్ వేసి సైన్ చేస్తారు.

ఎప్పడు రిజిస్టర్ చేస్తారు?

  • ప్రతి గురువారం సాయంత్రం 4 గంటల నుండి 6 గంటలవరకు తెలుగు సినీ రైటర్స్ అసోసియేషన్ ఆఫీసులో స్క్రిప్ట్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది.

  • తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ మెంబెర్ అయితే ముందుగా ఆ అసోసియేషన్ లో నో డ్యూ సర్టిఫికెట్ తీసుకొని, మెంబెర్ షిప్ కార్డు ని జిరాక్స్ కాపీ తీసుకొని వెల్లాలి.

On each page of the script/story stamping and signatures of the Telugu Cine Writers' Association executives
On each page of the script/story stamping and signatures of the Telugu Cine Writers' Association executives

ఎలా రిజిస్టర్ చేస్తారు ?

  1. రచయిత/రైటర్ వ్రాసిన కథని వారు వ్రాసిన పేరు లేదా టైటిల్ ని వారి రిజిస్టర్ లో వారి పేరు మీద ఆ రోజు డేట్, టైటిల్, మొత్తం పేజీలు రికార్డు చేసి వారికి ఒక రసీదు ఇస్తారు.

  2. రచయిత/రైటర్ వ్రాసిన పేజీల క్రింది భాగంలో (3 ఇంచెస్ స్పేస్ దగ్గర) సినీ రైటర్స్ అసోసియేషన్ సంఘములోని ఇద్దరు కార్యవర్గ (ఎగ్జిక్యూటివ్) ముఖ్యమైన (ఇంపార్టెంట్) వ్యక్తులు రిజిస్ట్రేషన్ చేసె ప్రతి స్క్రిప్ట్ పేజీ క్రింద మనం వొదిలేసిన 3 ఇంచెస్ స్పేస్ దగ్గర స్టాంపు వేసి ధ్రువీకరిస్తూ రచయిత/రైటర్ ముందరే సైన్ చేస్తారు.

  3. రచయిత/రైటర్ వ్రాసిన కథకు సంభందించిన మొత్తం పేజీలు తిరిగి రచయిత/రైటర్ తనతో తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎవరు మీ కథని చదవడానికి వీలు ఉండదు.

  4. ఈ కాపీని, రశీదుని జాగ్రత్త గా దాచి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైనా ఎవరైనా మీ కథని వారి కథగా వాడుకుంటున్నారని తెలిసిన వెంటనే అసోసియేషన్ లో పిర్యాదు చేస్తే వారు పైన్ రిజిస్ట్రేషన్ చేసిన కథని, రశీదును పరిశీలించి దానిని స్వీకరించి సమస్యని పరిష్కరిస్తారు.

పైన చెప్పిన అసోసియేషన్ మెంబెర్ షిప్ కొరకు ఈ క్రింది నంబర్స్ సంప్రదించగలరు.

తెలుగు సినీ రైటర్స్ అసోసియేషన్ ఫోన్ - 040-23738455 / 9989990229; www.telugucinewritersassociation.com

తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ఫోన్ -- 040-23743414; www.tfda.in



bottom of page