"కత్తి కన్నా కలం గొప్పది " అంటారు. కానీ,
వాటిని వాడే వ్యక్తిని బట్టి, వాటి బలము, ప్రభావం
ఉంటాయి. ఒక చిన్న మాట మన జీవన గమనాన్నే మారుస్తుంది . అలాంటి "మాటలు" అనే ఆయుధాన్ని నమ్ముకొని ఈ సినిమా పరిశ్రమలో సుమారు 20 సంవత్సరాలుగా యుద్ధం (నవరసాలని, మనసుకు హత్తుకునే లా ) చేస్తున్నారు. “మా” అన్నయ్య, Lakshmi Bhupala, మన అందరి అన్నయ్య "చిరంజీవి" సినిమా "గాడ్ ఫాదర్" కి డైలాగులు రాస్తున్నానని చెప్పినప్పుడు చెప్పలేని ఆనందం కలిగింది. ఎప్పుడెప్పుడు భూపాల్ అన్నయ్య మాటలని, మన అందరి అన్నయ్య చిరంజీవి నోటా వింటానా, వినాలని ఉత్సుకతతో ఎదురుచూశాను. .ఈ సినిమా ప్రతీ అప్డేట్ తెలుసుకునేలా చేసింది. సినిమా చూసాక నాకు ఆనందంతో మాటలు రాలేదు , ఒక్కో మాట, ఒక్కో తూటా లా మనసుకు తాకాయి. అందరు యూనానిమస్ గా మీ డైలాగ్స్ గురించి మాట్లాడేలా చేశారు. భూపాల్ అన్నయ్య మీ మాటల యుద్ధం, మీరు రాసిన డైలాగులు అన్నయ్య నోటా వింటుంటే మాటలతోనే దండయాత్ర చేసినట్టు అనిపించింది.
సినిమాలో ఒక సీన్ లో సింగల్ డైలాగుతో ఎనర్జీ క్రియేట్ చేసిన “ఇందుకోసమే వచ్చారా?" అన్న , అన్నయ్య డైలగ్ (మురళి శర్మతో)కి, మీరు ఇండస్ట్రీకి ఇలాంటి మాటలతో మమ్మల్ని విస్మయ పరిచేందుకే వచ్చారు అని నాకు అనిపించింది.
నాకు సుమారు 15 సంవత్సరాల పరిచయం మీతో
కలిసిన మొదటి రోజు నుండి ఈ రోజు వరకు
అదే ప్రేమ, అదే నిండు తనం, అదే నిర్మలత్వం.
మీరు మారలేదు, మీ మనసు మారలేదు.
ఇలాగే అందరికి అండగా ఉంటూ,
నవ్వుతూ, నవ్విస్తూ,
రాస్తూ, రమిస్తూ,
ప్రేమిస్తూ , స్పూర్తినిస్తూ,
కలకాలం సంతోషంగా ఉండాలని,
అలాగే మరిన్ని శిఖరాలని చేరుకోవాలని
మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
Comments