ఈ రోజు మాకు పండుగ రోజు " చిరంజీవి(వ) పుట్టిన రోజు "
Konidela Chiranjeevi అన్నయ్య !!
నాకు ఎప్పుడు అనిపిస్తుంది . 60 లో 20 లా ఎలా కనిపిస్తారని.. !?
తరాలు మారిన తరగని మీ స్టైల్,
నవ్వులో,నడకలో,డాన్సులో, డ్రెస్సులో,మాటలో,మనిషిలో, ఎలా ఉన్నాయని... !?
పోల్చుకో లేని, పోటీ పడలేని స్థాయికి చేరిన ఇప్పటికి విద్యార్థిని, అనే అంత గొప్ప వినయం ఎలా పొందారని... !?
ఇప్పటికి తెలుగు సినిమా అంటే చిరు, చిరు అంటే తెలుగు సినిమా అని, నిర్వచించేలా ఎలా చేయగలుగుతున్నారని... !?
ఎదిగిన కొద్దీ ఒదగాలని, అనే జీవిత సత్యాన్ని ఎలా ఆచరించ గలుగుతున్నారని... !?
మీ సినిమాలు చూస్తూ పెరిగిన మాకు, అప్పటి నుండి ఇప్పటి తరానికి,
స్టైల్ అంటే మీరు,
డాన్స్ అంటే మీరు,
పంచ్ డైలాగ్ అంటే మీరు,
ఫైట్స్ అంటే మీరు,
రికార్డు అంటే మీరు,
బాక్స్ ఆఫీస్ బద్దలవడం అంటే మీరు,
హిట్స్ అంటే మీరు,
రికార్డు బ్రేక్ అంటే మీరు,
అవార్డ్స్ అంటే మీరు ,
రివార్డ్స్ అంటే మీరు,
మెగాస్టార్ అంటే మీరు ,
సహనం అంటే మీరు,
సహాయం అంటే మీరు,
వ్యక్తిత్వం అంటే మీరు,
ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే మీరు,
ఈ అన్నిటికి కేర్ అఫ్ అడ్రస్ మీరు ఎలా అయ్యారని.. !?
ఈ పాండెమిక్ లో సినిమా కుటుంబానికి అన్నయ్యలా అన్నం పెట్టారు, మానవత్వం చాటి మహానుభావులు అనిపించుకున్నారు.
బ్లడ్ బ్యాంకు పెట్టి మాకు రక్తసంబంధం అయ్యారు, ఊపిరి పోసి మాకు ప్రాణదాత అయ్యారు .
ఎవరు ఏమన్నా , ఏమనుకున్నా , మీ నడవడి ఒక్కటే వాళ్ళకి సమాధానం అయ్యేలా ఎలా చేయగలిగారని... !?
మనుషులు మారుతున్న మీలో మంచితనం మారకుండా ఎలా ఉందని ... !?
ఇలా ఎన్నో ప్రశ్నలు, కానీ నాకు కనిపించే ఒకే ఒక్క సమాధానం " చిరంజీవి, చిరంజీవి .... చిరంజీవికి మాత్రమే సాధ్యం " !!
1993 లో అన్నపూర్ణ స్టూడియోస్ లో అప్పటి సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి సన్మాన సభకు మీరు వస్తున్నారని తెలిసి, మిమ్మల్ని చూడాలని వచ్చిన నాకు,మొదటి సారి 3 అడుగుల దూరంలో 6 అడుగుల మిమ్మల్ని చూసి కొన్ని అడుగులు మీతో వేసే అదృష్టం కలిగింది, ఆ జ్ఞాపకాలు ఇప్పటికి చెక్కు చెదరలేదు.
అప్పుడు సెల్ఫీస్ లేవు కానీ,
నా మనసులో ఉన్న మీ, ఆ రూపం ఇప్పటికి అలాగే భద్రంగా వుంది.
మళ్ళి మిమ్మలి కలవాలని , కలుస్తానని ఆశిస్తున్నాను.
మీరు మాకు,ఈ తరానికి, వచ్చే తరానికి , ఎప్పటికి ఆదర్శ ప్రాయులే,
తారలు మారిన, తరాలు మారిన మీరు ఎప్పుడు చిరంజీవిగా,చిరకాలం ఉండాలని, మీరు నమ్మే, నేను ఇష్టపడే ఆ ఆంజనేయుడిని వేడుకుంటూ..!
మీకు జన్మదిన శుభాకాంక్షలు Megastar Chiranjeevi అన్నయ్య !!
లవ్ యు అన్నయ్య !!
Comments