top of page
Writer's pictureHarinath Babu B

నా గురించి - వైవీఎస్ చౌదరి గారు

Updated: Dec 28, 2021

నువ్వు తోపు రా ట్రైలర్ విడుదల తర్వాత దర్శకుడు వైవిఎస్ చౌదరి ఫేస్‌బుక్ పేజీలో నా గురించి - https://www.facebook.com/photo.phpfbid=10216352803481918&set=t.1286738193&type=3&theater

YVS Chowdary praises Harinath Babu for hisdebutant direction of the movie  Nuvvu Thopu Raa
వైవిఎస్ చౌదరి మరియు హరినాథ్‌బాబు

‘హరినాథ్‌బాబు’ నా శిష్యుడు కాదు, నేను తన గురువుని కాను. ఎందుకంటే. గురుకులంలోలా సినీ పరిశ్రమలో ‘సినిమాని ఇలా తీయాలి, అలా తీయకూడదు’ అంటూ బోధనా పద్ధతులు ఉండవు, తమ దర్శకుడి అభిరుచిని అర్ధం చేసుకుంటూ, అతని ఆలోచనలకు తగ్గట్లుగా సహాయపడుతూ తమకున్న పరిశీలనాత్మక దృష్టితో తమ తమ శైలికనుగుణంగా అవగాహన మరియుPractical అనుభవాన్ని పెంపొందించుకోవటం తప్ప. నేనసలు నా వద్ద పనిజేసిన అసిస్టెంట్‌ డైరక్టర్స్‌ అందరినీ నా సోదరులుగా భావిస్తానే గాని, శిష్యులుగా కాదు. వాళ్ళు నన్ను గురువుగా భావిస్తే అది వారికి నాపైనున్న అభిమానంగా నేను భావిస్తాను. ‘హరినాథ్‌బాబు’ నాతో పనిజేసినప్పుడు అప్పజెప్పిన పనులన్నీ ఎంతో ఇష్టంతో చేసేవాడు, వినయవిధేయతలతో బాధ్యతాయుతంగా మెలగేవాడు, సకాలంలో పూర్తి చేసేవాడు.


తను దర్శకుడిగా మారి చేసిన మొదటి ప్రయత్నం నువ్వు తోపు రా సినిమాకు, తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటిసారి షూటింగ్ కంటే ముందుగా, తన తీయబోయే కధలోని Essence ని POC (ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్) పేరిట, ఖర్చుకీ, శ్రమకీ వెనకడుగేయకుండా అమెరికాలో తీసి ఓ Pre-shoot Teaser లా Release చేశాడు. తన సరికొత్త Marketing, Creative Thoughts తో ఒక్కసారిగా Viewers దృష్టిని తన సినిమా వైపు మరల్చుకోగలడమేగాక, Quality తో ఆకట్టుకున్నాడు, అందరి ప్రశంసలూ పొందాడు.


ఇక ఈ మధ్యే ‘విజయ్‌ దేవరకొండ’ చేతుల మీదగా తను రిలీజ్‌ చేసిన Teaser ద్వారా.. కసి, Energy & Mass Content తో Hero Character ని చూపించిన విధానం, మరెంతో మంది దృష్టిని ఆకర్షించి నువ్వు తోపు రా మూవీ చూడొచ్చు, చూడాలి అన్న ఆసక్తిని, ఆతృతని కలిగించటం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. ఇలాగే అతిత్వరలో రిలీజవ్వబోతున్న తన Theatrical Trailer, Audio & Movie లు కూడా అందరి ఆదరణ పొందాలని, Debutant Director గా ప్రేక్షకులకు పరిచయం కాబోతున్న ‘హరినాథ్‌బాబు’, ఓ Promising Director గా పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.


నువ్వు తోపు రా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్; ఎడమ నుండి - బేబీ జహానవి, శ్రీకాంత్ దాదుబాయి, హరినాథ్ బాబు, నిరోషా, విజయ్ దేవరకొండ, సుధాకర్ కోమాకుల, నిత్య శెట్టి
నువ్వు తోపు రా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్; ఎడమ నుండి - బేబీ జహానవి, శ్రీకాంత్ దాదుబాయి, హరినాథ్ బాబు, నిరోషా, విజయ్ దేవరకొండ, సుధాకర్ కోమాకుల, నిత్య శెట్టి

I wish Harinath Babu మరియూ తనకీ అవకాశం ఇచ్చిన Producer Srikanth Daduvai (India), Co-producer Dr James Kommu (Utah, USA), Associate Producer Ritesh Gupta (India) గార్లకు మరియూ Hero Sudhakar Komakula, Heroine Nitya Shetty, Mother Role పోషించిన Nirosha Ratha గార్లకు మరియూ to the people, who were supported him in India & as well in USA & I also wish the Artists & Technicians of Nuvvu Thopu Raa Team ‘all good luck’ & may God bless them with Super Success.


With Regards,

YVS Chowdary

Comments


bottom of page